Tuesday, 24 January 2017

భారతీయ చిత్రసీమలో ఓ వినూత్న వేదిక “కాస్మిక్ సినీ క్లబ్”

ఏడాది క్రితం ఇదే రోజున ( జనవరి 24, 2016) హైదరాబాద్ నగరంలో “కాస్మిక్ సినీ క్లబ్” ఆవిర్భవించింది. సినీ ప్రరిశ్రమలో పనిచేస్తున్న వారికి వేరువేరు సంఘాలు వుంటాయి. అవన్నీ వారి హక్కుల పరిరక్షణకు, సంక్షేమానికి పనిచేస్తాయి. కానీ అందరిని కలుపుతూ ఒక సృజనాత్మక వేదిక కావాలన్న ఆవశ్యకతను గుర్తించి కొంతమంది ఔత్సాహికులు “కాస్మిక్ సినీ క్లబ్” అనే వినూత్న వేదికను స్థాపించడం జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా కుల, మత, ప్రాంత, భాషా బేధాలకు అతీతంగా చలన చిత్రాలను శ్వాసించే వారందరినీ ఒకే సృజనాత్మక వేదిక పైకి తీసుకువస్తున్న సంస్థ ఇదే అని చెప్పవచ్చు.